ఐదేళ్ల వయసులోనే మహేష్ ను నా భర్తగా ఫిక్స్ అయ్యా

Phani CH

04 March 2025

Credit: Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి.. ఆయన చూసే చూపుకి గిలగిలా కొట్టుకునే అమ్మాయిలు కోకొల్లలు.

అయితే మహేష్ బాబుని చిన్నప్పటినుండి చూస్తున్న ఒక నటి..  అయినప్పటికీ ఎప్పటికీ మహేష్ బాబే నా భర్త అంటూ పబ్లిక్ గానే చెబుతోంది.

ఆమె ఎవరంటే నిహారిక. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

‘పెరుసు’ అనే మూవీతో హీరోయిన్ గా కూడా మారింది నిహారిక. ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోలు ఈమెతో తమ సినిమాకి ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు.

గతం లో మహేష్ బాబు, అడివి శేష్ తో కలిసి మేజర్ సినిమా టైంలో ప్రమోషన్ కోసం వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా నేషనల్ మీడియాకు ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాకు మహేష్ అంటే చెప్పలేనంత ఇష్టం అని మరొక సారి తెలిపింది.

మురారి సినిమా చూసే టైమ్ లో నా వయసు చాలా తక్కువ.  కానీ అప్పుడే ఫిక్స్ అయ్యాను ఆయనే నా మొగుడు అని తెలిపింది.

మహేష్ బాబు ఇప్పటి వరకు ఎవరితో కూడా రీల్స్ చేయలేదు. కానీ నాతో 2 సార్లు రీల్స్ చేశారు. ఆ రీల్స్ ఇప్పటికి కూడా నా ఫోన్లో దాచాను అంటూ తెలిపింది.