ప్రస్తుత కాలంలో కొత్త కొత్త వైరస్ లు కారణంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం శ్రద్ధ పెడుతున్నారు.. వ్యాయామం, యోగా దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు
ఈ క్రమంలోనే బరువు అదుపులో ఉంచుకోవాలి అనుకునే వారు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకుంటారు.
క్వినోవాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, క్వినోవా తినడం వల్ల శరీరానికి అమైనో ఆమ్లాలు ఎక్కువగా అందుతాయి. ఇది శాకాహారులకు అద్భుతమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
క్వినోవా ఫైబర్ మరియు ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్వినోవాలో విటమిన్ ఇ మరియు మాంగనీస్ వంటి వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు వాపు నుండి రక్షించడంలో సహాయపడతాయి.
క్వినోవాలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది, దీని వల్ల గట్‌లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. గట్ హెల్త్ మెరుగవుతుంది.
రక్తంలో చక్కెర లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో క్వినోవా అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
క్వినోవా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల దాని శక్తి నెమ్మదిగా విడుదలవుతూ ఆకలిని నియంత్రిస్తుంది.