అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా

Phani CH

04 March 2025

Credit: Instagram

అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది.

బుల్లితెరకు దూరమైన వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.

తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్‌గా  మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.

అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం తో బుల్లి తెరకు బై చెప్పేసింది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

వరుస సినిమాలతో అందరిని అలరిస్తోంది అనసూయ భరధ్వాజ్. తాజాగా అల్లు అర్జున ‘పుష్ప2 ది రూల్’ లో నటించి మెప్పించింది.

అనసూయ సినిమాలకు రోజుకి 1.5 నుంచి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. అయితే, ‘నాగబంధం’ సినిమాకి అనసూయ రోజుకు 3 నుంచి 4 లక్షల వరకూ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. 

యువ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న ‘నాగబంధం’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి ఆమె తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.