ఇదేందయ్యా ఇది.. రూ.100 కోట్ల బడ్జెట్‌తో రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా...?
04 March 2025
Rajeev
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న.
నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ.. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.
రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది ఈ అమ్మడు. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది.
ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ డ్రామాలుగా వస్తున్నాయి. అలాగే కుబేర సినిమాలోనూ చేస్తుంది.
కాగా ఓ బడా నిర్మాణ సంస్థ.. రష్మిక మందనతో లేడీ ఓరియెంటెడ్ ప్లాన్ చేస్తుందని టాక్. ఈ సినిమాకు ఏకంగా రూ.70 నుంచి రూ.100 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుందని అంటున్నారు.