AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: 21 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో త్రిష.. మరోసారి హిట్టు కాంబో రిపీట్.. తెలుగులోనే సినిమా..

దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో కొత్త ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Trisha: 21 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో త్రిష.. మరోసారి హిట్టు కాంబో రిపీట్.. తెలుగులోనే సినిమా..
Siddharth, Trisha
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2026 | 3:38 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ త్రిష. దాదాపు 20 సంవత్సరాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు మరో క్రేజ్ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఓ స్టార్ హీరోతో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌తో మళ్లీ ఒకే చిత్రంలో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జంట తొలిసారిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంవ హించిన ఆయుధ ఈషు సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

ఆ తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నటించారు. 2005లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమా తర్వాత 2016లో విడుదలైన అరన్మనై 2లోనూ కలిసి నటించారు. ఇక ఇప్పుడు సుమారు 8 ఏళ్ల విరామం తర్వాత సిద్ధార్థ్, త్రిషలు ఒక కొత్త తెలుగు చిత్రంలో నాలుగోసారి జత కట్టబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనుండగా, ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారని టాక్.

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రముఖ జంట చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వస్తుండటంతో, అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిష చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో త్రిష కనిపించనుంది. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న ‘కరుప్పు’ చిత్రంలో నటి త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

View this post on Instagram

A post shared by ELLE India (@elleindia)

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

Follow Us