AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Video : రియల్ హీరో అంటే తనే.. బుజ్జి అభిమాని కోరిక తీర్చిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్

MS Dhoni Video : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఒక చిన్నారి తన చేతిలో ఉన్న చిన్న బ్యాట్, ధోనీ ఫోటో ఫ్రేమ్‌తో ధోనీ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన ధోనీ, వెంటనే ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడాడు.

MS Dhoni Video : రియల్ హీరో అంటే తనే.. బుజ్జి అభిమాని కోరిక తీర్చిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్
Ms Dhoni Video
Rakesh
|

Updated on: Apr 22, 2026 | 4:53 PM

Share

MS Dhoni Video : ఐపీఎల్ 2026 సీజన్‌లో చిరకాల ప్రత్యర్థులైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య గురువారం జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠభరిత పోరుకు ముందు చెన్నై మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ చేసిన ఒక చిన్న పని సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది. మైదానంలో ఎంతటి సీరియస్ పరిస్థితులు ఉన్నా, బయట మాత్రం తన నిరాడంబరతతో ధోనీ మరోసారి అందరినీ ఫిదా చేశాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఒక చిన్నారి తన చేతిలో ఉన్న చిన్న బ్యాట్, ధోనీ ఫోటో ఫ్రేమ్‌తో ధోనీ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన ధోనీ, వెంటనే ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడాడు. ఆ బుజ్జి బ్యాట్‌పై సంతకం చేయడమే కాకుండా, ఫోటో ఫ్రేమ్‌పై కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. “ఈ బ్యాట్ నీ కోసం, ఈ ఫోటో ఫ్రేమ్ మీ నాన్న కోసం” అని చెప్పడం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ఈ చిన్నారికి, ధోనీకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ముంబైతో మ్యాచ్.. ధోనీ ఆడతాడా?

ఈ సీజన్ ప్రారంభం నుంచి ధోనీ కాలికి తగిలిన గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ నుంచి ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ధోనీ నెట్స్‌లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం సిఎస్‌కే అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గాయం నుంచి కోలుకుని, అతను రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. టాస్ సమయంలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సిఎస్‌కే కష్టాల్లో ఉంది.. ధోనీ రావాల్సిందే

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. చివరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో వెనుకబడిన చెన్నైకి, ముంబైతో జరిగే మ్యాచ్ ఎంతో కీలకం. ఇలాంటి క్లిష్ట సమయంలో ధోనీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం చెన్నైకి కొండంత బలాన్ని ఇస్తుంది.

ధోనీ అంటే ఒక ఎమోషన్

ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఆటలో ఉన్నా లేకున్నా, అతని గురించి చిన్న వార్త వచ్చినా అది సంచలనమే. మైదానంలో తన ప్రశాంతతతో ‘కెప్టెన్ కూల్’ అని పేరు తెచ్చుకున్న ధోనీ, బయట కూడా ఎంతటి సామాన్యుడితోనైనా అంతే గౌరవంగా ప్రవర్తిస్తాడు. తాజాగా ఈ చిన్నారి అభిమానితో చేసిన ముచ్చట చూశాక.. ధోనీ ఎందుకు అందరికీ అంత ఇష్టమో మరోసారి అర్థమైందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us