AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh : వారణాసిలో కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్‎తో రింకూ సింగ్ సందడి.. పెళ్లి ముహూర్తం ఖరారు ?

Rinku Singh : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, తన జట్టు తర్వాతి మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండటంతో రింకూ సింగ్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 21న తన కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి వారణాసి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Rinku Singh : వారణాసిలో కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్‎తో  రింకూ సింగ్ సందడి.. పెళ్లి ముహూర్తం ఖరారు ?
Rinku Singh
Rakesh
|

Updated on: Apr 22, 2026 | 3:07 PM

Share

Rinku Singh : భారత క్రికెట్ సంచలనం, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తనకు కాబోయే భార్య, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో కలిసి ఆయన పవిత్ర కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో లభించిన విరామంలో ఈ జంట బాబా విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోవడం, వారి పెళ్లికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూర్చింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, తన జట్టు తర్వాతి మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండటంతో రింకూ సింగ్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 21న తన కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి వారణాసి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దశాశ్వమేధ ఘాట్‌లో జరిగిన గంగా హారతిలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. “కాశీ.. మహాదేవుని నేల, గంగమ్మ పవిత్ర సంగమం” అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేశారు.

పెళ్లి ఎక్కడ? ఎప్పుడు?

తాజా సమాచారం ప్రకారం.. రింకూ సింగ్ – ప్రియా సరోజ్ వివాహం జూన్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ వేడుకకు వారణాసిలోని అత్యంత విలాసవంతమైన హోటల్ తాజ్ వేదిక కాబోతోందని వార్తలు వస్తున్నాయి. వీరు కాశీ పర్యటనలో భాగంగా అదే హోటల్‌లో బస చేయడం, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించడం చూస్తుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. దేవ దీపావళి వేడుకలకు కూడా ఈ జంటను వారణాసి నిర్వాహకులు ఆహ్వానించారు.

View this post on Instagram

A post shared by PRIYA SAROJ (@ipriyasarojmp)

ప్రియా గురించి ఆసక్తికర విషయాలు

రింకూ సింగ్ మనసు గెలుచుకున్న ప్రియా సరోజ్ సాధారణ వ్యక్తి కాదు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (SP) తరఫున గెలిచిన ఎంపీ. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, క్రికెట్ స్టార్ రింకూతో ఆమె గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం ముగియగా, ఇప్పుడు అధికారికంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

క్రికెట్ కెరీర్, ఐపీఎల్

ప్రస్తుతం రింకూ సింగ్ కేకేఆర్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో కేకేఆర్ ప్రస్థానం కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, ఏడో మ్యాచ్‌లో తొలి విజయం అందుకోవడంతో జట్టులో ఉత్సాహం పెరిగింది. టీమిండియా తరఫున కూడా రింకూ సింగ్ అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నారు. 45 టీ20లు, 2 వన్డేలు ఆడిన రింకూ, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us