లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శ్రుతిహాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది.
సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, బాలకృష్ణ లతో పాటు రజినీకాంత్ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తుంది.
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేసి పాన్ ఇండియా హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శృతి సినిమాల స్పీడ్ తగ్గించింది.
కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ఆచితూచి అడుగులేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటాను అంటూ కామెంట్స్ చేసి వైరల్ అయ్యింది.