AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. లైఫ్‌లో మర్చిపోనంటున్న శ్రుతిహాసన్

వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్-1.. ఇలా బ్యాక్ బు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్- రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది.

Shruti Haasan: నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. లైఫ్‌లో మర్చిపోనంటున్న శ్రుతిహాసన్
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2025 | 3:49 PM

Share

అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై చేసింది.. కానీ అక్కడ లక్ కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు తెలుగు. తమిళ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టిపెడుతుంది ఈ చిన్నది. ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది.

శ్రుతి కేవలం నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంటుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ పాడుతుంది. మొన్నామధ్య నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలోనూ ఓ పాట పాడింది శ్రుతి.  రీసెంట్ గా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలోనూ ఓ పాటను ఆలపించింది ఈ అమ్మడు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబూ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమా ఈ రోజే( జూన్ 5)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రుతి ఓ పాట ఆలపించింది. ఈ సాంగ్ గురించి ఆమె మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

నా జీవితకాలంలో ఎన్నో పాటలు పాడాను.. ప్రేక్షకులను నా సాంగ్స్ ను ఎంజాయ్ చేశారు.. కానీ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు. థగ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి స్పందన వస్తుంది. నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్ లు చేస్తున్నారు. నాన్న సినిమాలో పాట పాడటం నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఇలాంటి అదృష్టం ఎంతమంది కూతుర్లకు వస్తుందో నాకు తెలియదు.. కానీ ఇది మాత్రం నిజంగా ఇదొక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్. నా లాఫ్ లో మెమరబుల్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!