AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andala Rakshasi : మరోసారి థియేటర్స్‌లోకి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి.. రిలీజ్ ఎప్పుడంటే

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల హంగామా కనిపిస్తుంది. నిజానికి కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Andala Rakshasi : మరోసారి థియేటర్స్‌లోకి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి.. రిలీజ్ ఎప్పుడంటే
Andala Rakshasi
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2025 | 3:09 PM

Share

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల బర్త్ డేలకు, స్పెషల్ డేలకు ఆ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. హిట్ అయినా సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోల పాత సినిమాలు విడుదలై థియేటర్స్ లో మరోసారి దుమ్మురేపాయి.

ఇక ఇప్పుడు ఓ క్లాసిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది.. ఆ సినిమా ఎదో కాదు అందాల రాక్షసి. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది.

అందాల రాక్షసి సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాక్షసి సినిమా మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 13న అందాల రాక్షసి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ అందమైన ప్రేమకథను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..