Shruti Haasan: అతడిలో ఎక్కువగా నచ్చినవి అవే.. ప్రియుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..
అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తార.. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తన చెల్లెలు అక్షర, ప్రియుడు శాంతను హజారికతో కలిసి ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే ఫిట్ నెస్.. వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ
కొద్ది రోజులుగా శ్రుతి హాసన్ ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. కొన్ని నెలలుగా ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తార.. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తన చెల్లెలు అక్షర, ప్రియుడు శాంతను హజారికతో కలిసి ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే ఫిట్ నెస్.. వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్ స్టా వేదికగా ఫాలోవర్లతో క్విజ్ నిర్వహించింది. ఈక్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన విషయాలకు క్రేజీ ఆన్సర్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.
మీరిద్దరిలో ఎవరు బాగా వండుతారు ? అని ప్రశ్నించగా.. నేను బాగు వంట చేస్తాను అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే.. ఎక్కువగా ఎవరు తింటారు? అని అడగ్గా.. శాంతను అంటూ చెప్పేసింది. ఇక మీ ప్రియుడిలో నచ్చే లక్షణాలు ఏంటీ? అని ప్రశ్నించగా.. తన ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది శాంతను. అతను ఎంతో తెలివైనవాడు అని.. తనను బాగా నవ్విస్తాడని.. కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడని.. అన్నింటికంటే ముఖ్యమైనది తనను ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది.
అతని కళ్లు అంటే చాలా ఇష్టమని తన ప్రేమను వ్యక్తం చేసింది. అలాగే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని అడగ్గా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి హాసన్ నటించిన సలార్ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.