Shruti Haasan: ఇకపై అలా పిలిస్తే ఊరుకునేది లేదు.. నెటిజన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన శ్రుతి హాసన్..
తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతిహాసన్ రీఎంట్రీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. గతేడాది సలార్ సినిమాతో థియేటర్లలో అలరించిన శ్రుతి హాసన్ ఇప్పుడు సలార్ 2 కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో ప్రతి క్షణం బిజీగా ఉండే శ్రుతిహాసన్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్నప్పటికీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసుకుంది. కానీ ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సొంత ఇమేజ్‌తో అనేక సక్సెస్ లను సంపాదించుకుంది. నటిగా, సింగర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతిహాసన్ రీఎంట్రీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. గతేడాది సలార్ సినిమాతో థియేటర్లలో అలరించిన శ్రుతి హాసన్ ఇప్పుడు సలార్ 2 కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో ప్రతి క్షణం బిజీగా ఉండే శ్రుతిహాసన్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
నిత్యం ఏదోక పోస్ట్, రీల్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టా చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి అని అడగ్గా స్ట్రాంగ్ కౌంటరిచ్చింది శ్రుతి. “ఈ రకమైన జాతి వివక్షను నేను అసలు సహించను. మమ్మల్ని ఇడ్లీ, సాంబర్ అంటూ పిలిస్తే ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరు. కాబట్టి సౌత్ ఇండియన్స్ లా ఉండాలని ఎప్పటికీ ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు” అంటూ తమిళంలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి చేసిన కామెంట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Shruti Haasan
మొదటి నుంచి సౌత్ నటీనటులపై బాలీవుడ్ స్టార్స్ చిన్నచూపు చూస్తారన్న సంగతి తెలిసిందే. దక్షిణాది వారిని ఇడ్లీ, సాంబార్ అంటూ పిలుస్తూ కామెడీ అంటూ సమర్థించుకుంటున్నారు బీటౌన్ స్టార్. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సైతం ఇడ్లీ, వడ అంటూ కామెంట్ చేయగా.. ఇప్పుడు శ్రుతిహాసన్ పరోక్షంగా అతడికి కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది. శ్రుతిహాసన్ కామెంట్ పై ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



