AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..

Balayya 107 Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.

Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2021 | 4:48 PM

Share

Balayya 107 Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… మరో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా అటు సెట్స్ పై ఉండగానే.. ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి అటు సోషల్ మీడియాలో బాలయ్య 107 సినిమా గురించి గాసిప్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. బాలయ్య.. గోపీచంద్ కాంబోలో రానున్న ఈ సినిమా కోసం హీరోయిన్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. శృతి హాసన్ తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇందుకు శృతి కూడా పాజిటివ్ గానే స్పంధించినట్లుగా టాక్. ఇక అటు సీనియర్ హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే త్రిష.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేసింది. మరోపక్క నయనతారను కూడా హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట మైత్రీ మూవీ మేకర్స్. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాత్రం శృతీ హాసన్ నే హీరోయిన్ గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరీ ఫైనల్ గా బాలయ్య తో జోడీ కట్టనున్న హీరోయిన్ ఎవరో చూడాల్సిందే.

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..