Hyper Aadi: జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఫిర్యాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్..
బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది పరిచయం అక్కర్లేని పేరు. జబర్ధస్త్ కామెడి షోలో తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది.
బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది పరిచయం అక్కర్లేని పేరు. జబర్ధస్త్ కామెడి షోలో తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. అటు వెండితెరపై కూడా పలు అవకాశాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి.
ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కోనట్లుగా తెలుస్తోంది. ఆది, స్క్రీఫ్ట్ రైటర్.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఆదిపై ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Desi Ghee Benefits : ప్రకాశవంతమైన ముఖం కోసం దేశీ నెయ్యి..! చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం..?