సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన హీరోయిన్.. ఆమెను అలా చూసి అందరూ షాక్

ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన సినిమా గమనం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన కథతో ఈ సినిమా రూపొందింది. గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన హీరోయిన్.. ఆమెను అలా చూసి అందరూ షాక్
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2021 | 5:47 PM

ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన సినిమా గమనం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన కథతో ఈ సినిమా రూపొందింది. గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాలో శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా వీక్షించడానికి హీరోయిన్ శ్రియ హైదరాబాద్‌లోని మల్లికార్జున థియేటర్ కు వచ్చింది. అయితే అందరిలా కారులో రాకుండా ఈ అమ్మడు ఆటోలో వచ్చి షాక్ ఇచ్చింది. శ్రియ ఆటోలో వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఆమె ప్రేక్షకులతో కలిసి సినిమా చూసారు. అనంతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది శ్రియ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియ.. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియ.

Shriya

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!