RRR Trailer: కుంభస్థలం పైనే కన్నేసిన ‘ఆర్ఆర్ఆర్’.. బద్దలు కొట్టడం ఖాయం.. ట్రైలర్‌కు రికార్డ్ వ్యూస్..

రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న సినిమాలావర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR Trailer: కుంభస్థలం పైనే కన్నేసిన 'ఆర్ఆర్ఆర్'.. బద్దలు కొట్టడం ఖాయం.. ట్రైలర్‌కు రికార్డ్ వ్యూస్..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2021 | 4:22 PM

RRR : రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న సినిమాలావర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ఖండాలు దాటించిన ఘనుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజయ్యాక.. ఎలాఉన్నా రికార్డులు బద్దుల కొట్టడం.. కలెక్షన్ల సునామి సృష్టించడం కామన్‌. కాని జక్కన్న అండ్‌ టీం మాత్రం ఇప్పటినుంచే కలెక్షన్ల సునామీని స్టార్ట్‌ చేసిందని మీకు తెలుసా..? కేవలం ట్రైలర్ తోనే.. పైసా వసూల్ కార్యక్రమాన్ని తెరతీసిందని మీకు తెలుసా..? యూట్యూబ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ను ఖాళీ చేసే దిశగా పోతుంది తెలుసా..? పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీని.. ఎప్పుడెప్పుడు చూడాలా..అనే వెయిటింగ్ విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్‌ అయిన ట్రైలర్ య్యూట్యూబ్‌ కుంభస్థలాన్నే కొట్టేస్తోంది. రికార్డు లెవల్‌ వ్యూస్‌తో… ఈ వీడియో ప్లాట్‌ ఫాంను రఫ్పాడిస్తోంది.

రిలీజైన 24 గంటల్లో 51.1కు మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సంపాదించింది ఈ ట్రైలర్‌. ఇక తెలుగులో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ 22 మిలియన్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని అరుదైన రికార్డును ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తన ఖాతాలో వేసుకుంది. దీన్నిబట్టే అర్ధమవుతుంది. జక్కన సినిమా రికార్డులను తిరగరాయటం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగు ట్రైలర్ వ్యూస్‌కు తీసిపోదన్నట్టు 23 మిలియన్ల వ్యూస్‌ను నోట్ చేసింది ట్రిపుల్ ఆర్ హిందీ ట్రైలర్. ఇక వీటితో పాటు తమిళ్ , కన్నడ, మలయాళ ట్రైలర్లు కూడా మిలియన్ల కొద్ది వ్యూవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆయా స్టేట్స్లో ట్రెండ్ అవుతున్నాయి. ఓవర్ ఆల్‌గా బిగ్ ఫిగర్‌లో.. వ్యూవర్స్‌ను పట్టేసి.. యూట్యూబ్‌ నుంచి బిగ్ రెవెన్యూను కొట్టేస్తుంది ట్రిపుల్ ఆర్ అండ్ టీం. ట్రైలర్ తో కూడా రికార్డు లెవల్లో సంపాదిస్తూ.. పాన్‌ ఇండియా ఫిల్మ్ కు మరో ఇన్‌కమ్‌ను ఎలా జెనరేట్ చేసుకోవాలో చూపిస్తోంది జక్కన్న టీం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!