ఇది బిగ్ బాస్ అనుకున్నారా.? లేక బస్సు అనుకున్నారా.? శివాజీ కౌంటర్ ఆమెకేనా..
దివ్వెల మాధురి. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆమె పేరు వార్తల్లో తెగ వినిపించింది. అలాగే ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆతర్వాత ఆమె ట్రోల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు మాధురి. దాంతో ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని సంఘటనలుజరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. వారాంతంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచేస్తున్నవారు కొందరు అయితే.. ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లిన అయేషా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. విపరీతమైన జ్వరం కారణంగా ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమె తిరిగి హౌస్ లోకి వెళ్తుంది అనుకున్నారు కానీ ఆమె రాలేదు,. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో రాము రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రాము చివరి వరకు ఉంటాడు అని అందరూ అనుకున్నారు.
చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు
మనోడికి బయట నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా బాగానే ఉంది.. ప్రతిసారి నామినేషన్స్ లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ అతన్ని ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకుంటూ వచ్చారు. కానీ నాకు హౌస్ లో ఒంటరిగా అనిపిస్తుంది. నేను ఉండలేకపోతున్నాను.. దయచేసి నన్ను పంపించేయండి అంటూ వేడుకున్నాడు. నాగార్జున ఎంత బ్రతిమిలాడినా నేను ఉండలేను సారు అంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.. రాము రాథోడ్ ను హౌస్ లో ఉంచేందుకు నాగ్ చాలా ప్రయత్నించారు. కానీ రాము నాగ్ మాట వినలేదు.
దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రామును శివాజీ ఆడేసుకున్నాడు. బిగ్ బాస్ బజ్ పేరుతో శివాజీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే రాము రాథోడ్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఎప్పుడంటే అప్పుడు లోపలి వెళ్ళడానికి.. నచ్చినప్పుడు బయటకు రావడానికి ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా..? లేక బస్సు అనుకుంటున్నారా..? అంటూ శివాజీ రాము పై ఫైర్ అయ్యాడు. అలాగ రాను బొంబాయికి రాను సాంగ్ చేయడానికి 5 ఏళ్లు కష్టపడ్డ నువ్వు.. ఇక్కడ కప్పు కొట్టడానికి కేవలం 15 వారాలే కదా.. ఉండలేకపోయావా .? అని రాము పై ప్రశ్నల వర్షం కురిపించాడు శివాజి. అయితే ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్స్ స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరన్నా జస్ట్ బిగ్‌బాస్ హౌస్ చూద్దామని వచ్చేవాళ్లకి చెప్తున్నా ప్లీజ్ దయచేసి రాకండి.. మీ ప్లేస్‌లో ఇంకొకరు వస్తారు.. కొన్ని కోట్లమందికి డ్రీమ్ ఈ బిగ్‌బాస్ హౌస్.. ఆ డ్రీమ్‌ని జస్ట్ నేను రావాలనుకున్నాను నేను పోవాలనుకున్నాను.. ఇదేమన్నా బస్సా.. అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న నెటిజన్స్ మాధురిని అడగాల్సిన ప్రశ్నలు రాముని అడుగుతున్నారని.. ఆమెను అనలేక ఇప్పుడు రాము దగ్గర డైలాగ్స్ కొడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది శివాజీ మాధురికి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేశారని అంటున్నారు.








