Puneeth Rajkumar: పునీత్‌ను గుర్తుతెచ్చుకున్న శివరాజ్‌కుమార్.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్.. ఓదార్చిన బాలయ్య
తాజాగా జరిగిన ఈవెంట్‌లో భాగంగా పునీత్ రాజ్‌కుమార్ ఏవీని ప్లే చేశారు. దీన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు శివరాజ్‌కుమార్. దీంతో పక్కనే ఉన్న బాలయ్య.. ఆయనను ఓదార్చారు.

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా అభిమానుల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో పవర్‌స్టార్‌గా చెలామణి అవుతోన్న సమయంలోనే పిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆయన మరణవార్త విని కర్ణాటకలోనే కాదు యావత్ సినిమా ఇండస్ట్రీ విషాద సంద్రంలో మునిగిపోయింది. తెలుగు హీరోలు కూడా పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అలా అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పునీత్‌ను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్. తన కొత్త సినిమా వేద ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారాయన. తాజాగా జరిగిన ఈవెంట్‌లో భాగంగా పునీత్ రాజ్‌కుమార్ ఏవీని ప్లే చేశారు. దీన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు శివరాజ్‌కుమార్. దీంతో పక్కనే ఉన్న బాలయ్య.. ఆయనను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.
ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణించాలి..
కాగా కన్నడ కంఠీవ రాజ్ కుమార్ కు ముగ్గురు కుమారులు. వారిలో శివరాజ్ కుమార్ కన్నడలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కూడా పవర్‌స్టార్‌గా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పిన్న వయసులోనే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. కాగా శివరాజ్‌కుమార్ నటించిన వేద చిత్రం గురువారం (ఫిబ్రవరి 9)న విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ’ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవవసరం లేదు. ఒకరిగురించి మరొకరికి బాగా తెలుసు. భార్యని ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ చేస్తున్న శివరాజ్ కుమార్ ని అభినందిస్తున్నా. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలి. శివరాజ్ కుమార్ కి కళామతల్లి ఆశీస్సులు ఉండాలని ఒక అన్నగా కోరుకుంటున్నా. రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎంతో మందికి జీవితాన్ని అందించిన గొప్ప కుటుంబం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
