‘శ్రీకారం’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎమోషనల్‏గా కట్టిపడేసిన శర్వానంద్.. ఈసారి కూడా సూపర్ హిట్టే..

Sreekaram Movie Twitter Review: విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన

  • Rajitha Chanti
  • Publish Date - 12:54 pm, Thu, 11 March 21
'శ్రీకారం' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎమోషనల్‏గా కట్టిపడేసిన శర్వానంద్.. ఈసారి కూడా సూపర్ హిట్టే..
sreekaram movie review

Sreekaram Movie Twitter Review: విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే సినిమాలను చేయడం శర్వానంద్ స్పెషాలిటీ. ఇక ఇదే ఫార్ములతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం శర్వానంద్.. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో రావు రమేష్, వీకే నరేష్, ఆమ‌ని, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ విడుదలైంది.

శ్రీకారం మూవీ యూఎస్ ప్రీమియర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక సినిమా చూసిన వారందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. శ్రీకారం మూవీ సూపర్ అని.. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కామెంట్స్ చేస్తున్నారు. విభిన్న సినిమాలను ఎంచుకుంటున్న శర్వానంద్ ఈ మూవీ చేయడం నిజంగా గ్రేట్ అంటూ అభినందిస్తున్నారుత. ఇందులో శర్వానంద్ ఎమోషనల్‏గా కట్టిపడేసాడని ట్వీట్స్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్‏తో సాగగా.. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలలో వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకుడు కచ్చితంగా అయిపోతారని తెలిపారు. ఇంతేకాకుండా ఇందులో శర్వానంద్, మురళీ శర్మ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయని.. ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో మరోక క్యారెక్టర్ రావు రమేష్ నటన అదుర్స్ అంటున్నారు. వ్యవసాయం గురించి విభిన్నంగా వివరించేందుకు డైరెక్టర్ ప్రయత్నించినట్లుగా తెలుస్తోందని తెలిపారు. అంతేకాకుండా.. ఈ సినిమాను పూర్తిగా ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారని అంటుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై కమర్షియల్ మరకలు పడ్డాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో శర్వానంద్ మరోసారి హిట్టు కోట్టడం ఖాయామంటున్నారు.

లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు

తొలి టీ20: సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశే.. ఓపెనర్‌గా రాహుల్.. తుది జట్టులో కీలక మార్పులు!

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం