AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand : చేతిలో ఆయుధంతో టాలెంటెడ్ హీరో.. ఆకట్టుకుంటున్న ‘మహాసముద్రం’ ఫస్ట్ లుక్..

యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసే శర్వానంద్ త్వరలో శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Sharwanand :  చేతిలో ఆయుధంతో టాలెంటెడ్ హీరో.. ఆకట్టుకుంటున్న 'మహాసముద్రం' ఫస్ట్ లుక్..
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2021 | 11:56 AM

Share

Sharwanand ‘Maha Samudram’ Movie: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసే శర్వానంద్ త్వరలో శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాతోపాటు అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న అజయ్ భూపతి శర్వానంద్ తో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు బొమ్మరిల్లు హీరో సిద్ధర్థ్ కూడా నటిస్తున్నాడు.

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా మహాసముద్రం సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చేతిలో ఆయుధం పట్టుకొని చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు శర్వానంద్. ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మరో వైపు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’ ను ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : జోరు పెంచిన మెగాస్టార్.. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

Allu Arjun New Movie: అల్లు అర్జున్‌ కొత్త సినిమా నేపథ్యం ఇదేనా..? సమాజానికి మరో సందేశం ఇవ్వనున్న కొరటాల..?

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!