AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : జోరు పెంచిన మెగాస్టార్.. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.

Chiranjeevi : జోరు పెంచిన మెగాస్టార్.. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2021 | 11:33 AM

Share

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ కాస్త గ్యాప్ తీసుకున్నారు.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా మెగాస్టార్ తోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టారు చిరు.

వీటిలో మెహార్ రమేష్ తో వేదలమ్ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.  వీరితోపాటు చిరుతో సినిమా చేయాలని డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. తాజాగా ఇద్దరు యంగ్  డైరెక్టర్స్ కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారట.

ఆ ఇద్దరు దర్శకులు ఎవరో కాదు వరస విజయాలను అందుకుంటున్న అనీల్ రావిపూడి, వెంకీ కుడుముల. అనీల్ రావిపూడి పటాస్ సినిమాతో మొదలు పెట్టి సరిలేరు నీకెవ్వరూ వరకు వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారిపోయాడు. గత ఏడాది  సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్క్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుములు కూడా చిరు కోసం కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ యంగ్ డైరెక్టర్ కూడా గతఏడాది నితిన్ తో భీష్మ సినిమా చేసాడు వెంకీ ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఇప్పటికే వెంకీ కుడుముల చిరంజీవికి ఒక లైన్ చెప్పాడని.. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయాలని మెగాస్టార్ చెప్పారట. మరి ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్ బాస్ కోసం ఎలాంటి సినిమాలు సిద్ధం చేస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam Serial : ఓ వైపు అంజి..ని మోనిత ఇంటికి తీసుకెళ్తున్న కార్తీక్.. మరోవైపు ఊరుదాటుతున్న దీప

Allu Arjun New Movie: అల్లు అర్జున్‌ కొత్త సినిమా నేపథ్యం ఇదేనా..? సమాజానికి మరో సందేశం ఇవ్వనున్న కొరటాల..?

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి