Allu Arjun New Movie: అల్లు అర్జున్‌ కొత్త సినిమా నేపథ్యం ఇదేనా..? సమాజానికి మరో సందేశం ఇవ్వనున్న కొరటాల..?

Allu Arjun New Movie: 'మిర్చి' సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారాడు డైరెక్టర్‌ కొరటాల శివ. అంతకుముందు రచయితగా రాణించిన కొరటాల 'మిర్చి'తో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో ఓవైపు...

Allu Arjun New Movie: అల్లు అర్జున్‌ కొత్త సినిమా నేపథ్యం ఇదేనా..? సమాజానికి మరో సందేశం ఇవ్వనున్న కొరటాల..?
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 06, 2021 | 9:58 AM

Allu Arjun New Movie: ‘మిర్చి’ సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారాడు డైరెక్టర్‌ కొరటాల శివ. అంతకుముందు రచయితగా రాణించిన కొరటాల ‘మిర్చి’తో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో ఓవైపు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకుంటూనే మరోవైపు, ఫ్యాక్షనిజం నేపథ్యంలో సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక అనంతరం ‘శ్రీమంతుడు’, ‘జనాతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’ సినిమాలతో వరుసగా సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించాడీ టాప్‌ డైరెక్టర్‌.

టాప్‌ హీరోలను తన సినిమాలో ఉండేలా చూసుకుంటేనే వారితో మంచి సందేశాలనిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ స్టార్‌ డైరెక్టర్‌ తాజాగా ‘ఆచార్య’ సినిమాతో దేవాలయాల పరిరక్షణ అనే సందేశంతో వస్తున్నాడు. ఈ సినిమాతో కొరటాల తొలిసారి చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా పూర్తికాగానే కొరటాల మరో మెగా హీరో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తన ప్రతీ సినిమాలో ఏదో ఒక సామాజిక సందేశం ఉండేలా చూసుకునే కొరటాల ఈసారి వాయుకాలుష్యం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీల కారణంగా, మనుషుల బాధ్యత రాహిత్యంతో నీరు ఎలా కాలుష్యం అవుతుందన్న సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Rhea Chakraborty : రియా చక్రవర్తి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఛార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌లో షాకింగ్ విషయాలు తెలిపిన ఎన్సీబీ..

Vijay Deverakonda : సుకుమార్ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అలా కనిపించబోతున్నాడా..?

నటుడిగా ‘ప్రస్థానం’.. విభిన్న కథలే ‘గమ్యం’.. ప్రేక్షకాదరణకు ‘శ్రీకారం’.. హ్యాపీ బర్త్ డే యంగ్ హీరో శర్వానంద్