Karthika Deepam Serial : ఓ వైపు అంజి..ని మోనిత ఇంటికి తీసుకెళ్తున్న కార్తీక్.. మరోవైపు ఊరుదాటుతున్న దీప

తెలుగు వారి ఆదరణను సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ మార్చి 6న 979 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

  • Surya Kala
  • Publish Date - 10:08 am, Sat, 6 March 21
Karthika Deepam Serial : ఓ వైపు అంజి..ని మోనిత ఇంటికి తీసుకెళ్తున్న కార్తీక్.. మరోవైపు ఊరుదాటుతున్న దీప

Karthika Deepam Serial : తెలుగు వారి ఆదరణను సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ మార్చి 6న 979 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

ఆనందరావుని హాస్పటల్ లో చేర్పించిన ఫ్యామిలీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుంది. కార్తీక్ పరీక్షలు చేస్తుంటే.. ఇంతలో రిపోర్ట్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ ను చూసిన కార్తీక్ ఏం భయం లేదు ఒక్క కొలెస్ట్రాల్ మాత్రమే అదుపు దాటింది. మీకు డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఏమీ లేవు కనుక భయం లేదు .. అయితే ఇక్కనుంచి దీప గురించి ఆలోచించే వ్యసనం మానుకోమని చెబుతాడు కార్తీక్.
అప్పుడు సౌందర్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ కార్తీక్ ని వారిస్తుంది. ‘నన్ను చెప్పనీ మమ్మీ.. మీరిద్దరూ ఆ దీప గురించి ఆలోచించడం మానెయ్యండి.. అది స్మోకింగ్ డ్రింకింగ్ కన్నా ప్రమాదకరమైంది. అవి గుండెపై ఊపిరితిత్తుల మీద ప్రభావం చూసిస్తే..  ఆ దీప.. చాలా కష్టపడిపోతుంది ఆవిడ జీవితాన్ని ఎలా మార్చాలి అనేది ఉంది చూశారా.. అది అన్నింటినీ నాశనం చేసి.. మనిషిని కుంగదీస్తుంది. అందుకుని నా మాట విని.. ఆమెని మరిచిపోయి ప్రశాంతంగా ఉండండి..ఇక ఆదిత్య నువ్వుకూడా ఆమె ఫ్యాన్స్ క్లబ్ లో చేరిపోయావు.. ఉడుకు రక్తం కదా.. ఆవేశం ఉంటుంది జాగ్రత్త. డాడీకి ఏం ఫర్వాలేదు.. ఇంటికి తీసుకుని వెళ్లు.. అంటాడు కార్తీక్.  ఎందుకు అన్నయ్యా.. అంత కంగారు పడుతున్నావ్ ఇది మన హాస్పెటలే కదా..?’ అంటాడు ఆదిత్య.

ఎం లేదు ఇప్పటికే కొంతమందికి ఫోన్లు వెళ్లి ఉంటాయి. ఎవరు ఓదార్పు యాత్రకు వస్తారో అని అంటాడు కార్తీక్. కావాల్సినవాళ్లు రావడం..పలకరింపులు, ఏడుపులు, నిట్టూర్పులు.. చాలా డ్రామ్ క్రియేట్ అయిపోతుంది.. అవి మీకు ఆనందాన్ని కలిగించొచ్చేమో.. నాకు బీపీ పెరుగుతుంది.. నాకు కూడా హార్ట్‌ ఎటాక్ రావచ్చు.. మళ్లీ నాకు సేవలు.. సపర్యలు.. అవన్నీ అవసరమా చెప్పండి..’ అంటాడు.

ఇంతలో ఆనందరావు బెడ్ మీద నుంచి దిగి… మాకు చెప్పింది చాలు.. ఇక నువ్వు కూడా అదే ఆలోచన మానుకో జాగ్రత్త అని చెప్పి… స్టార్ట్ అవుతాడు. వెంటనే సౌందర్య.. ‘ఆదిత్యా.. బిల్ ఎంతైందో తెలుసుకోరా పే చేసేద్దాం’ అంటుంది. దాంతో కార్తీక్ నవ్వుతూ.. ‘ఈ టైమ్‌లో కూడా సెన్స్ ఆఫ్ హూమర్ ఎక్కువుగానే ఉంది మమ్మీ.. డాడీకి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పకుండా ఇలాంటి జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉండు.. బయలుదేరండి’ అంటూ అందరినీ పంపించేస్తాడు కార్తీక్.

దీప తన ఇంట్లో దేవుడి ముందు నిలబడి.. ఇక ముందు ప్రాధేయపడను.. ఏం జరిగితే అది జరగనియ్యి. ఎం చేశారని మీకు ఎందుకు ఎందుకు దండాలు.. ఇంకెందుకు దీపాలు? విన్నవాళ్లు ఎవ్వరు? ఎవ్వరూ లేరు.. నాకు ఎవ్వరూలేరు.. నేను నా బిడ్డలు.. మళ్లీ నా ఒంటరి తనం.. చీకటి..మీకు అర్జీలు పెట్టడం ఇక మానేస్తాను అని బాధగా దేవుడిని ప్రశ్నిస్తుంది.

ఇంతలో తల్లిదగ్గరకు హిమ, సౌర్య వచ్చి.. ‘అమ్మా మన ఫోటోస్ ఏవీ?’ అనడంతో సర్దిపెట్టిన ఓ అట్టపెట్టివైపు చూస్తుంది దీప. హిమ . ‘ఇవన్ని ఎందుకు సద్దావమ్మా?’ అంటుంది. ‘మీ నాన్న వచ్చి తీసుకుని వెళ్తారని సద్దనమ్మా’ అంటుంది దీప.

‘ఇక డాడీ రారుగా.. తెలిసిపోయిందిగా.. మళ్లీ తగిలిస్తానుండు అని హిమ అంటుంది. అయితే దీప ఇక వాటిని గోడకు తగిలించే అవసరం లేదు. ‘మీ నాన్న లేడుగా ఆ ఫోటోలో.. ఇక రాడు. మనల్ని పిలవడు.. మనం అక్కడికి వెళ్లం.. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే మరిచిపోవాలి. జ్ఞ‌ాపకాలని కూడా మరిచిపోవాలి.. అందుకే వద్దు.. పెట్టొద్దు.. మనతో ఉన్నవాళ్ల ఫోటోస్ పెడితే.. మనతో లేనివాళ్లు గుర్తొస్తారు.. గుర్తొస్తే మాత్రం వస్తారా?’ అంటూ దీప బాధపడుతూ ఉంటుంది.

అప్పుడు శౌర్య మనం ముగ్గురం ఉన్నాం కదా.. ఇక ఫొటోస్ ఎందుకు అని అర్దిచెబుతుంది. మీకు నేనే అమ్మని నేనే నాన్నని నేనే.. తొమ్మిది నెలలు కడుపులో మోసాను.. ఇప్పుడు మోస్తాను అని హిమనీ, శౌర్యని దగ్గరకి తీసుకుంటుంది.

కార్తీక్ మోనిత ఇంటికి వెళ్తాడు. ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొచ్చిన మోనిత.. ‘తీసుకో కార్తీక్’ అంటూ ఇస్తుంది. కార్తీక్ బాధగా ‘నాకు కూర్చుంటే పడుకోవాలని ఉంది. పడుకుంటే కూర్చోవాలని ఉంది. ఇక్కడికి వస్తే ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇంటికి వెళ్తే బయటికి వెళ్లాలని ఉంది. తిండిమీద అలసట మీద ఏదిమీద ఆలోచన లేదు.. బెంగగా ఉంది. దిగులుగా ఉంది. మొత్తానికి ఏదో తెలియని వెలితిగా ఉంది. చాలా రోజుల తర్వాత మందుతాగాలని ఉంది అంటాడు కార్తీక్.

మోనిత వెటకారంగా ఎందుకు ఇంత దిగులు, ఇంత బెంగ? పిల్లలు వెళ్లిపోయినందుకా? పిల్ల తల్లి వెళ్లిపోయినందుకా?’ అంటుంది. ‘మా అమ్మలా మాట్లాడుకు మోనితా.. మీ అమ్మ ఆ దీప గురించే మాట్లాడుతుందని అందరికీ తెలుసు’ అంటుంది మోనిత వెటకారంగా. ‘నేను నా గురించి మాట్లాడుతున్నాను అంటాడు కార్తీక్. అయినా సరే మోనిత ఆపకుండా నేను నీ వెలితి గురించి మాట్లాడుతున్నా కార్తీక్ అంటుంది.

ఇప్పుడు ఏం అన్నాను నీ భార్యని..? హిమని నీ దగ్గర పెంచింది. హిమ ద్వారా తల్లిని తీసుకొస్తావని ఆశపడింది. హిమ ద్వారా అడిగించింది. ఆ పప్పులు ఉడకలేదు.. వెంటనే శౌర్యని ప్రయోగించింది. ఇడ్లీ బండిని పరిచయం చేసింది.. ఇంటిపైన చాపమీద పడుకుని చుక్కలు లెక్కబెట్టడం ఎలాగో నేర్పింది.. నాన్న అని పిలిచి శౌర్య ని కూడా తెచ్చుకుని పెంచుకుంటా అని నీతోనే అనేలా ట్రైనింగ్ ఇచ్చి పప్పించింది. ఇప్పుడు ఆ ఇద్దరి పిల్లల కోసం కలిసొచ్చే కాలం వస్తే.. నడిచొచ్చే పెళ్లాం వస్తుంది అని.. సద్దిచెప్పుకుని తీసుకుని తెచ్చుకోవాలనుకుంటున్నావేమో.. ఎవరికీ తెలుసు అంటూ మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే ఉంటుంది.

వెంటనే కార్తీక్ ఇక మాట్లాడింది చాలు అంటూ ఫైర్ అయ్యి నిజంగా నేనొక ఫూల్‌ని.. ఇప్పటిదాకా నన్ను నన్నుగా అర్థం చేసుకునే ఒక్క ఫ్రెండ్‌ని కూడా సంపాదించుకోలేకపోయాను.. అక్కడనుంచి లేచి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్లగానే మోనిత నవ్వుకుంటూ.. ‘పిచ్చి కార్తీక్ .. అక్కడ మీ అమ్మ వేసే సెటైర్లు భరించిలేక మళ్లీ నా దగ్గరికే వస్తావు.. ఎక్కడికి వెళ్తావ్ ఈ మోనితని దాటుకుని.?’ అంటూ నవ్వుకుంటుంది.

ఇక ఆనందరావు, సౌందర్యలు ఇద్దరూ దీప గురించి మాట్లాడుకుంటారు. ‘ఇందాకే దీపకు కోసం ఫోన్ చేశాను.. లిఫ్ట్ చెయ్యలేదండీ’ అని సౌందర్య అనగానే.. ‘ఒకసారి వెళ్లి చూసిరా సౌందర్య’ అని సౌందర్యని దీప ఇంటికి పంపిస్తాడు. కార్తీక్ కారులో వస్తూ ఉండగా.. అంజి బైక్ మీద ఎదురుపడతాడు. వెంటనే అంజీ మోనిత గురించి చెప్పడానికి ట్రై చేసిన సీన్ గుర్తొస్తుంది. వెంటనే అంజీ ఆగు.. అని ఆపుతాడు.  బైక్ పక్కనెట్టి కారు ఎక్కు.. కార్తీక్ మనసులో.. ‘ఇవాళ్ల వీడ్ని తీసుకెళ్లి.. మోనిత ముందు నిలబెట్టి.. ఆ పిచ్చి వాగుడేంటో బయటపెట్టి.. అందరి నోళ్లు ముయ్యించాలి.. ప్రతివాళ్లు నన్ను మోనితని టార్గెట్ చేసేవాళ్లే’ అనుకుంటాడు.  అంజీని తీసుకుని మోనిత ఇంటికి వెళ్తున్న కార్తీక్.. అంజీ మాట వింటాడా? మోనిత ట్రాప్ లో మళ్ళీ పడతాడా.. సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో చూడాల్సిందే ..!

Also Read:

అల్లు అర్జున్‌ కొత్త సినిమా నేపథ్యం ఇదేనా..? సమాజానికి మరో సందేశం ఇవ్వనున్న కొరటాల..?

రియా చక్రవర్తి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఛార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌లో షాకింగ్ విషయాలు తెలిపిన ఎన్సీబీ..