AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ నిజస్వరుపం ఇదే.. ఆమె ఓ విష సర్పంలాంటిది.. షాకింగ్ విషయం చెప్పిన షకీలా

ఇక్కడ గేమ్ ఆడి ఎవరైతే ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారో వారే కంటిన్యూ అవుతారు అని తెలిపారు. ఇక కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మొదటి వారం కంటే రెండో వారంలో మంచి రంజుగా సాగింది. హౌస్ లో గొడవలు, గోలలతో నానా హంగామాగా సాగుతుంది. హౌస్ లో ఉన్న వారిలో నామినేషన్స్ ప్రక్రియలో గొడవలు బాగానే జరుగుతున్నాయి. రెండో వారంలో రతికాతో హౌస్ మెంబర్స్ అందరితో గొడవలు పెట్టుకుంది. తన మొండి తనంతో అందరితో వాగ్వాదం పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసింది.

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ నిజస్వరుపం ఇదే.. ఆమె ఓ విష సర్పంలాంటిది.. షాకింగ్ విషయం చెప్పిన షకీలా
Shakeela
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2023 | 12:24 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈసారి ఉల్టా పుల్టాగా ఉంటుందని ముందే చెప్పారు కింగ్ నాగార్జున అన్నట్టుగానే ప్రతిసారి దాదాపు 20 మంది వరకు హౌస్ లోకి వెళ్తారు. కానీ ఈ సారి కేవలం 14 మందిని మాత్రమే హౌస్ లోకి పంపించారు. అందులో అందరూ కన్ఫామ్ కాదు అని చెప్పారు. ఇక్కడ గేమ్ ఆడి ఎవరైతే ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారో వారే కంటిన్యూ అవుతారు అని తెలిపారు. ఇక కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మొదటి వారం కంటే రెండో వారంలో మంచి రంజుగా సాగింది. హౌస్ లో గొడవలు, గోలలతో నానా హంగామాగా సాగుతుంది. హౌస్ లో ఉన్న వారిలో నామినేషన్స్ ప్రక్రియలో గొడవలు బాగానే జరుగుతున్నాయి. రెండో వారంలో రతికాతో హౌస్ మెంబర్స్ అందరితో గొడవలు పెట్టుకుంది. తన మొండి తనంతో అందరితో వాగ్వాదం పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసింది.

ఆ తర్వాత ప్రిన్స్ యావర్ కు గౌతమ్ కృష్ణ కు మధ్య గట్టి గొడవే జరిగింది. కొట్టుకునే రేంజ్ వరకు వెళ్ళింది. ప్రిన్స్ చిన్న పిల్లాడిలా ఏడిచాడు కూడా.. మొత్తమీద రెండో వారం అంతా రచ్చ రచ్చగా సాగింది. ఎలిమినేషన్స్ నేపథ్యంలో షకీల హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. బిగ్ బాస్ నుంచి షకీలా బయటకు రావడంతో హౌస్ లో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన షకీలా హౌస్ లో ఉన్నవారి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ తర్వాత బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ షకీలను ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో షకీలా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆశ్రమానికి వెళదామని వచ్చారా..? ఎలా బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నా అనుకోని వచ్చారా..? అని ప్రశ్నించింది గీతూ. దానికి షకీలా సీరియస్ అయ్యారని చూపించారు. అలాగే  హౌస్ లో శివాజీ బ్యాచా..? సీరియల్ బ్యాచా..? అని ప్రశ్నించగా నేను చెప్పాను అని అన్నారు షకీలా. నువ్వు నన్ను అడిగేదేంటి.? అని అన్నారు షకీలా.. బిగ్ బాస్ రియల్ గేమా..? ఫేక్ గేమా..? అని ప్రశ్నించింది గీతూ. దానికి నేను ఏది ప్లాన్ చేసుకొని రాలేదు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారిగురించి చెప్పుకుంటూ వచ్చారు. అమర్ దీప్ కు కోపం ఎక్కువ అన్నారు. అలాగే యావర్ ను పెద్ద ఎదవ అన్నారు. బాడీ ఉందికాని బ్రెయిన్ లేదు అన్నారు. పల్లవి ప్రశాంత్ గురించి చెప్తూ.. పాపులారిటీ డ్రాగ్ కు ఎడిక్ట్ అయ్యాడు అని చెప్పారు. అలాగే శివాజీ గురించి సొంత అన్నలాంటి వారు అని తెలిపింది షకీలా. రతిక అందమైన విష సర్పం అని తెలిపింది షకీలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.