Bhagavanth Kesari: బాలయ్య కొత్త సినిమా వాయిదా పడనుందా.? చిత్ర యూనిట్ స్పందన ఇదే..
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దసారా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. బాలకృష్ణ షూటింగ్‌కు హాజరుకాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పూర్తి కావడంలో ఇబ్బందులు ఉన్నాయని ఈ కారణంగా సినిమాను...

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను సొంతం చేసుకున్న బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చేతులు కలిపారు. ‘భగవంత్ కేసరి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి స్టేజ్‌లో ఉంది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దసారా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. బాలకృష్ణ షూటింగ్‌కు హాజరుకాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పూర్తి కావడంలో ఇబ్బందులు ఉన్నాయని ఈ కారణంగా సినిమాను కనీసం రెండు నెలలైనా వాయిదా వేస్తారని సోషల్ మీడియా కోడై కూసింది.
అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ‘భగవంత్ కేసరి’ మూవీ వాయిదా వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపినట్లు సమాచారం. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా చేయనుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
కేవలం మరో వారం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్‌కు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
భగవంత్ కేసరీ టీజర్…
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
