Jawan Collections: బాక్సాఫీస్ వద్ద ‘జవాన్’ బీభత్సం.. రెండు రోజుల్లోనే 250 కోట్లకు చేరువలో షారుక్ ఖాన్ సినిమా
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆయన నటించిన జవాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 7)న గ్రాండ్‌గా విడుదలైన జవాన్ మొదటి రోజే సుమారు రూ. 130 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా థియేటర్ల వద్ద జవాన్ హవా కొనసాగింది. ఏకంగా రూ.113 కోట్లు వసూలు చేసినట్లు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆయన నటించిన జవాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 7)న గ్రాండ్‌గా విడుదలైన జవాన్ మొదటి రోజే సుమారు రూ. 130 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా థియేటర్ల వద్ద జవాన్ హవా కొనసాగింది. ఏకంగా రూ.113 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంటే రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 240 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందన్నమాట. ఈ కలెక్షన్లకు తోడు వీకెండ్ కలిసి రానుంది. ఈ వారం పూర్తయ్యే సరికే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. కాగా జవాన్ సినిమాకు రూ. 300 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్‌తో బరిలోకి దిగిన జవాన్ రెండు రోజుల్లోనే దానిని సమీపించింది. త్వరలోనే బ్రేక్ ఈవెన్‌ను దాటి లాభాల బాటలో పయనిస్తోంది.
బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో షారుక్ సినిమా..
జవాన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10వేల థియేటర్లలో విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ పెద్ద ఎత్తున షారుక్ సినిమాను రిలీజ్ చేశారు. సౌతిండియన్ సూపర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్‌బ్యూటీ దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. షారుక్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ జవాన్ సినిమాను నిర్మించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. రెండు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరిన జవాన్ రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంటారో చూడాలి మరి.
రామయ్యా వస్తావయ్యా సాంగ్ చూశారా?
View this post on Instagram
జవాన్ బ్లాక్ బస్టర్ ప్రోమో..
View this post on Instagram
థియేటర్ల వద్ద పండగ వాతావరణం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




