AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram gopal Varma: గడిచిన 20 ఏళ్లలో విజయ్‌ దేవరకొండ లాంటి హీరోను చూడలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్‌జీవీ.

Ram gopal Varma Vijay Devarakonda: సంచలనాలకు మారుపేరు రామ్‌ గోపాల్‌ వర్మ. సమజాంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన తీరులో స్పందిస్తూ నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేస్తుంటారు వర్మ. టాపిక్‌ ఏదైనా...

Ram gopal Varma: గడిచిన 20 ఏళ్లలో విజయ్‌ దేవరకొండ లాంటి హీరోను చూడలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్‌జీవీ.
Rgv Vijay
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 20, 2021 | 5:40 AM

Share

Ram gopal Varma Vijay Devarakonda: సంచలనాలకు మారుపేరు రామ్‌ గోపాల్‌ వర్మ. సమజాంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన తీరులో స్పందిస్తూ నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేస్తుంటారు వర్మ. టాపిక్‌ ఏదైనా తన వైపు అటెన్షన్‌ వచ్చేలా చేసుకోవడంలో వర్మకు ఎవరూ సాటిరారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదేమో. ఈ క్రమంలోనే తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వర్మ తాజాగా డ్యాషింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘లైగర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొదటిసారి ఈ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న విజయ్‌ ఇప్పటికే బీ టౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా సెన్సేషన్‌ హీరోగా మారిన విజయ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్‌ వేదికగా విజయ్‌ని ప్రస్తావిస్తూ.. ‘లైగర్‌ సినిమాలో విజయ్‌ కనిపించనున్న తీరు.. గడిడిన 20 ఏళ్లలో వచ్చిన స్టార్‌ హీరోల కంటే అద్భుతంగా ఉండనుంది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందుకు పూరీజగన్నాథ్‌, చార్మీలకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ను రౌడీ ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు. మరి పాన్‌ ఇండియా నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే చిత్రం విడుదల వరకు వేచి చూడాలి.

వర్మ చేసిన ట్వీట్..

Also Read:  OTT: ఒటీటీ సూపర్‌హిట్.. 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న మార్కెట్..మరింత వేగంగా విస్తరణ!

Kota Srinivasa Rao: జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై, అందులోని ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేసిన విలక్షణ నటుడు

Indian Actress: నయా రూటులో సుందరాంగులు.. సడెన్ ఛేంజ్ వెనుక రీజన్ ఏంటో..?