RGV Tweet: “2022లో మ‌నుషులు ఉండ‌క‌పోవ‌చ్చు”.. త‌న‌దైన శైలిలో కామెంట్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

RGV Tweet: కాంట్ర‌వ‌ర్సీ ఎక్క‌డ ఉంటే అక్క‌డ రామ్ గోపాల్ వ‌ర్మ ఉంటారు. కేవ‌లం త‌న సినిమాల‌తోనే కాకుండా వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు అల‌వాటు. ఏ విష‌యంలోనైనా స‌రే తన‌వైపు...

RGV Tweet: 2022లో మ‌నుషులు ఉండ‌క‌పోవ‌చ్చు.. త‌న‌దైన శైలిలో కామెంట్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..
Rgv Tweet
Follow us

|

Updated on: Apr 30, 2021 | 10:23 PM

RGV Tweet: కాంట్ర‌వ‌ర్సీ ఎక్క‌డ ఉంటే అక్క‌డ రామ్ గోపాల్ వ‌ర్మ ఉంటారు. కేవ‌లం త‌న సినిమాల‌తోనే కాకుండా వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు అల‌వాటు. ఏ విష‌యంలోనైనా స‌రే తన‌వైపు అటెన్ష‌న్‌ను పెంచుకోవ‌డం వ‌ర్మ‌కు కాంట్ర‌వ‌ర్సీతో పెట్టి విద్య‌. నిత్యం ఏదో ర‌కంగా వార్త‌ల్లో నానుతూ ఉండే వ‌ర్మ తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఫ‌న్నీ కామెంట్ చేశారు. ఒక అమ్మాయి ధ‌రించిన టీష‌ర్ట్‌పై గ‌త మూడేళ్ల‌లో ప‌రిస్థితుల ఎలా మారుతున్నాయ‌న్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ మూడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు రాసున్నాయి. అవి.. 2019లో నెగిటివ్ ఆలోచ‌న‌ల‌తో ఉండే వారికి దూరంగా ఉండండి. 2020లో పాజిటివ్ (క‌రోనా) వ్య‌క్తుల‌కు దూరంగా ఉండండి. 2021 అస‌లు మ‌నుషుల‌కే దూరంగా ఉండండి. అనే కొటేష‌న్‌లు ఉన్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. 2022లో అసలు మ‌నుషులే ఉండ‌రు కావొచ్చు అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ చూసిన అభిమానులు కామెంట్లు, లైక్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత‌టీ సీరియ‌స్ అంశాన్ని కూడా ఫ‌న్నీగా మార్చ‌డం ఆర్‌జీవీకే చెందింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్‌..

Also Read: కోవిడ్ పై పోరులో సహకరిస్తాం, ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లేఖ , ‘సానుభూతి వెల్లువ’

Vaccination: ప్రయివేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు గమనిక..! మూడు నెలల ఉచిత రీఛార్జ్..? అసలు విషయం ఏంటి..