Laya: చీరకట్టులో స్టెప్పులేసి అందాల లయ.. వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు లయ. ఈ అమ్మడు మంచి డాన్సర్. కూచిపూడి లో లయకు మంచి ప్రావిణ్యం ఉంది.

ఒకప్పుడు అందం అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో లయ ఒకరు. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతో అలరించారు లయ. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు లయ. ఈ అమ్మడు మంచి డాన్సర్. కూచిపూడి లో లయకు మంచి ప్రావిణ్యం ఉంది. హీరోయిన్ కంటే ముందు లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత స్వయం వరం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే లయమంచి విజయాన్ని అందుకుంది. ఇక లయ నటించిన మనోహరం, ప్రేమించు సినిమాలకు వరుసగా నంది అవార్డులు అందుకుంది.
ఇక సినిమాలు కొంత గ్యాప్ ఇచ్చిన లయ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అయినా కూడా లయకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడంలేదు. ఆమె చివరిగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కనిపించరు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు లయ. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం రకరకాల ఫొటోలతో పాటు.. డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా ఆమె డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాల్ నటించిన సినిమాలోని పాటకు లయ అదిరిపోయే స్టెప్పులేశారు. చీరకట్టులో లయ చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram