Krishnam Raju: రాధేశ్యామ్ సినిమాపై కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రభాస్ ఆ సినిమా చేయాలంటూ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై మిక్స్ టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్.. పూజా హెగ్డే కెమిస్ట్రీ.. విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన 24 గంటల్లోనే దాదాపు రూ. 79 కోట్లు క్రాస్ చేయడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ తిరిగి లవర్ బాయ్ పాత్ర పోషించడం.. క్లాసికల్ మూవీగా వచ్చిన రాధేశ్యామ్ మూవీ బాక్సాపీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీనియర్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ఇంట్లో జారీ పడడంతో కృష్ణం రాజు కాలుకు దెబ్బతగడం.. ఆ తర్వాత సర్జరీ కావడంతో ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణంతోనే రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోయారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” ఈ సినిమా నాకు చాలా సంతోషాన్నించింది. ప్రభాస్.. నేను ఇంతకుముందు కలిసి నటించాం. ఈసారి మా అమ్మాయి ప్రసీద కూడా ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను పరమహంస పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర చూస్తే వివేకానందుడు రామకృష్ణ పరమహంస మదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్ర చేయడం సంతృప్తినిచ్చింది. ఆ పాత్ర ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. పరమహంస పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టు ఉందని ప్రభాస్ అన్నాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళ్తుంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. రాధేశ్యామ్ కాడా ఆలస్యమై ఉండేది కాదు.. కానీ కరోనా సంక్షోభం.. వలన ఇంత ఆలస్యం అయ్యింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని నాతో చెప్పాడు.. రాధేశ్యామ్ సినిమాను బాహుబలితో పోల్చకూడదు. అలాగే.. మనవూరి పాండవులు సినిమాను ప్రభాస్ రీమేక్ చేయాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు .
Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్..
Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..
Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్..