AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Sekhar Kammula: ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.. చిన్న సినిమా పై శేఖర్ కమ్ముల ప్రశంసలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలు , కొత్త దర్శకులు, కొత్త హీరోలు తెగ సందడి చేస్తున్నారు. కొత్త కొత్త కథలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్, హీరోలు. అలాగే కుర్ర హీరో తిరువీర్‌ కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో రానున్నాడు.

Director Sekhar Kammula: ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.. చిన్న సినిమా పై శేఖర్ కమ్ముల ప్రశంసలు
Sekhar Kammula
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2025 | 12:48 PM

Share

వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు.

అనంత‌రం శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా టీమ్ మొత్తం యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తోంది. అంద‌రిలో మంచి వైబ్ ఉంది. సినిమా టీజ‌ర్ స‌ర‌దాగా సాగిపోయింది. తిరువీర్ ప్రామిసింగ్ హీరో. టాలీవుడ్‌లో త‌న‌కంటూ సొంతంగా ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ ఈవెంట్‌కు పిల‌చినిప్పుడే ఇదొక స్పెష‌ల్ ఫిల్మ్ అనిపించింది. తీరువీర్‌కు ప్రీ వెడ్డింగ్ షో లాంటి మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి. హీరోయిన్ నాచుర‌ల్‌గా క‌నిపించింది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం, పాష‌న్ ఉండాలి. నిర్మాత‌ల‌ను చూస్తుంటే నా డాల‌ర్ డ్రీమ్స్‌, ఆనంద్ రోజులు గుర్తొచ్చాయి. కంప్లీట్ క్లీన్ ఫిల్మ్ అని తీరువీర్ అన్నాడు. బ్యాక్‌డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌ను చూడ‌గానే సినిమా చూడాల‌ని అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడి మార్కు క‌నిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ షో సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాలి’’ అని తెలిపారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘‘ఫ్రెండ్ స‌జేష‌న్‌తో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ క‌థ విన్నాను. క‌థ వింటున్న‌ప్పుడు స్టార్టింగ్ నుంచి చివ‌రి వ‌ర‌కు న‌వ్వుతూనే ఉన్నాను. అప్పుడే ఈ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాను. మార్కెట్ లెక్క‌ల గురించి ఆలోచించ‌కుండా నిర్మాత‌లు సందీప్, రంజిత్‌ ధైర్యంగా సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు. కొత్త ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ రిస్క్ చేసి సినిమా చేస్తున్న‌ప్పుడు మంచి క‌థ‌ను స‌పోర్ట్ చేయ‌డానికి నేను ఏం చేయ‌గ‌ల‌ను అనిపించింది. ప‌ప్పేట్ షో అనే బ్యాన‌ర్ లాంఛ్ చేసి రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా సినిమాలో భాగం అయ్యాను. ఈ సినిమా నా న‌మ్మ‌కాన్ని నిల‌బెడితే భ‌విష్య‌త్తులో ఇలాంటి కొన్ని సినిమాలు చేస్తాను. షూట్ మొత్తం పిక్నిక్‌లా సాగింది. ఇంటిల్లిపాది క‌లిసి చూసే మంచి సినిమాగా ప‌ప్పేట్ షో నిలుస్తుంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ ‘‘టీజ‌ర్ శాంపిల్ మాత్ర‌మే. రెండు గంట‌లు ప్ర‌తి సీన్‌, డైలాగ్ బాంబ్‌ల పేలిపోతాయి. తీరువీర్ నుంచి చాలా నేర్చుకున్నారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హేమ పాత్ర‌కు న్యాయం చేయ‌డ‌మే కాకుండా న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడి న మ్మ‌కాన్ని నిల‌బెట్టాన‌ని అనుకుంటున్నాను’’ అని తెలిపింది.

శేఖర్ కమ్ముల స్పీచ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.