Shaakuntalam: ఎక్స్పెటెషన్స్ పీక్స్.. శాకుంతలం శాటిలైట్ రైట్స్ డీల్ సెట్టైపోయిందా..
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతంతలాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతంతలాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచింది. దీంతో శాకుంతలం సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. శాకుంతలం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
ఇక ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ డీల్ కూడా భారీ అమోంట్ కు జరుగుతుందని తెలుస్తోంది. ఈ న సినిమా పై గట్టి నమ్మకంతో ఉన్నారు దర్శన నిర్మాతలు. గతంలో వచ్చిన యశోద సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజువల్ వండర్ గా త్రీడీలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.




