Shaitan: సేవ్ ది టైగర్స్ తర్వాత క్రైమ్ సిరీస్‌తో రానున్న దర్శకుడు.. ఆకట్టుకునే కథతో సైతాన్

సేవ్ ది టైగ‌ర్స్ త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు డైరెక్ట‌ర్ మ‌హి. వి.రాఘ‌వ్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సైతాన్ అనే సిరీస్‌ను తెర‌కెక్కిస్తోన్నాడు.

Shaitan: సేవ్ ది టైగర్స్ తర్వాత క్రైమ్ సిరీస్‌తో రానున్న దర్శకుడు.. ఆకట్టుకునే కథతో సైతాన్
11
Follow us
Rajeev Rayala

| Edited By: Basha Shek

Updated on: Jun 03, 2023 | 1:00 PM

ఇటీవల వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ సైతాన్. మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షో రెడ్ అలెర్ట్. సేవ్ ది టైగ‌ర్స్ త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు డైరెక్ట‌ర్ మ‌హి. వి.రాఘ‌వ్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సైతాన్ అనే సిరీస్‌ను తెర‌కెక్కిస్తోన్నాడు. ఈ సిరీస్ లో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉండనుంది.. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా కుదుపుకు గురైంది అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఆ ఫ్యామిలీ క్రైమ్ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది కథలో కీలకంగా ఉంటుంది.

సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15, 2023న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సేవ్ ది టైగర్స్ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ తర్వాత మహి వి రాఘవ్ రెండవసారి డిస్ని ప్లస్ హాట్ స్టార్ తో టీమ్ అప్ అయ్యారు. తాజాగా ఈ వెబ్ సిరీస్  ఫ‌స్ట్‌లుక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఓ పోలీస్‌ను మ‌ర్డ‌ర్ చేస్తూ ప్ర‌ధాన పాత్ర‌ధారులు క‌నిపిస్తోన్నారు.

ఒక తెలుగు వెబ్ సిరీస్ లో క్రైమ్ సన్నివేసాలని ఇతరహాలో భయకంరంగా చూపించడం తొలిసారి. వెన్నులో వణుకుపుట్టించే విధంగా సీన్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి అంటున్నారు మేకర్స్. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని మీరు తగిన జాగ్రత్తలతో చూడండి అని అంటున్నారు టీమ్.