మహేశ్‌బాబు సోదరిగా బాలీవుడ్ టాప్ స్టార్ !
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. దీంతో నటీనటులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ సోదరి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనున్నారట. ఈ విషయమై మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వగా, సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలలో బాలయ్య సరసన అలరించారు విద్యాబాలన్. కాగా ‘సర్కారు వారి పాట’ లో ఇప్పటికే అనిల్ కపూర్ ను విలన్ గా ఫైనల్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
అమెరికా డెట్రాయిట్ నగరంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చేసేందుకు పరుశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతుంది. సుమారు నలభైఐదు రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేశ్ హీరోయిన్ నటిస్తుండగా, తమన్ సంగీతమందిస్తున్నారు.
Also Read :
ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!