ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి..పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!
Follow us

|

Updated on: Sep 16, 2020 | 4:30 PM

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి..పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రష్యా 100 మిలియన్ మోతాదుల కోవిడ్19 వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీస్ కు సరఫరా చేస్తుంది. ట్రయల్స్, పంపిణీ ఒప్పందం రెండూ సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం మీద ఆధారపడి ఉంటాయి. ట్రయల్స్ విజయవంతమైతే, ఈ సంవత్సరం చివరి నాటికి టీకా భారతదేశంలో లభిస్తుంది.

“కోవిడ్-19 వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో భారతదేశం ఒకటి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. కోవిడ్ -19కి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో భారతదేశానికి సురక్షితమైన, శాస్త్రీయంగా ధృవీకరించబడిన వ్యాక్సిన్ అందిస్తామని నమ్ముతున్నాము” అని ఆర్.డి.ఐ.ఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరిల్ డిమిత్రివ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఒప్పందంపై డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కో-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ మాట్లాడుతూ, “భారత జనాభా భద్రత, సామర్థాలను పరిగణలోకి తీసుకోని , మన అవసరాలను తీర్చడానికి మేము భారతదేశంలో ఈ వ్యాక్సిన్ స్టేజ్3 ట్రయల్స్ నిర్వహిస్తాము. భారతదేశంలో కోవిడ్19 కి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సత్ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నాం” అని తెలిపారు.

Also Read :

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?

కేసు పెట్టిన భార్య.. పీఎస్ ఎదుట భర్త ఆత్మహత్య