దొంగగా మారిన టీవీ సీరియల్ నటి

దొంగగా మారిన టీవీ సీరియల్ నటి

కొవిడ్ దెబ్బకు చాలామంది ఉపాధి కోల్పోయి... బతుకు బండి సాధించడానికి కొత్త రంగాలు ఎంచుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే అలా ఉపాది కోల్పోయిన ఓ తమిళ నటి మాత్రం.... దోంగగా అవతారం ఎత్తింది..

Balaraju Goud

|

Sep 16, 2020 | 5:16 PM

కరోనా దెబ్బకు అందరి జీవితాలు తలకిందులుగా మారాయి… దర్జాగా బతికిన కుటుంబాలు ధనం పోయి దిక్కులు చూస్తున్నారు. కొవిడ్ దెబ్బకు చాలామంది ఉపాధి కోల్పోయి… బతుకు బండి సాధించడానికి కొత్త రంగాలు ఎంచుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే అలా ఉపాది కోల్పోయిన ఓ తమిళ నటి మాత్రం…. దోంగగా అవతారం ఎత్తింది.. ‌సహజీవనం చేస్తున్న ప్రియుడుతో కలసి దొంగతనానికి స్కేచ్ వేసి బంగారం, డబ్బులు కొట్టేసింది‌.. తీరా, అసలు విషయం బయటపడడంతో ఇద్దరు కటకటాలపాలయ్యారు. కడలూరు జిల్లా పన్రుతిలో చోటు చేసుకున్న ఈ ఘటన కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది..

కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్య, సినీ,టీవీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి‌‌. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా సినిమాలు, సీరియళ్ల షూటింగులు నిలిచిపోయాయి.. దీంతో ఈ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి ఉన్నన్నాళ్లు డాబు దర్ఫంతో యధేచ్చగా ఎంజాయ్ చేశారు. రోజు మొఖంపై మేకప్, ఒంటిపై ఇస్త్రీ నలగని దుస్తులతో సోకులు పోయారు. అలాంటి ప్రస్తుతం కుటుంబ పోషణనే భారంగా మారింది. ఇదే క్రమంలో ఓ కోలివుడ్ నటి రోజలు గడపడానికి దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ నటి ఎవరో కాదు దేవత అనే సీరియల్ తో పాటు పలు సీరియళ్లలో ముఖ్య పాత్రల్లో నటించిన సుచిత్రా.

టీవీ సీరియల్స్ లో నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ నటికి లాక్ డౌన్ కష్టాలు వెంటాడాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో ఈజీ మని కోసం దొంగగా మారాలని ప్లాన్ వేసింది‌.. ప్రియుడు మనికందన్ సాయంతో చోరీలకు పాల్పడింది. చెన్నైలో ప్రముఖ సినీ నటులకు, సీరియల్ నటులకు డ్రైవర్ గా పని చేస్తున్న మనికందన్ తో సుచిత్రకు పరిచయం అయింది. మణికందన్ కు చాలా సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఆ విషయం తెలిసి కూడా మణికందన్ తో సహజీవనం చేస్తోంది సుచిత్రా… అయితే, ఇటు సిరియల్స్ లేక సుచిత్రాకు, షూటింగులు లేకుండా డ్రైవర్ మణికందన్ పనిలేకపోవడంతో అర్దిక ఇబ్బందలు తలెత్తాయి. ప్రియురాలు సుచిత్రా చెప్పిన ఫ్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. దొంగతనం చేసేందుకు ఒప్పుకోవడంతో మణికందన్ ఇంట్లోనే దొంగతనం చేసేలా ఆమె ప్లాన్ చేసింది సుచిత్రా.

సుచిత్రా ప్లాన్ ప్రకారం.. కడలూరు జిల్లా పన్రుతిలో మణికందన్ సొంత గ్రామానికి చేరుకున్నారు‌. మణికందన్ తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లడంతో.. ఇంటిలో ఉన్న 18 సవరాల బంగారంతో పాటు 50,000 రూపాయల నగదు దొంగిలించాడు. అయితే, ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటికే మణికందన్ ను అరెస్ట్ చేయగా నటి సుచిత్ర మాత్రం పరారీలో ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu