Animal : యానిమల్ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? అసలు విషయం చెప్పిన సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటించాడు . అక్కడకూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఇప్పుడు యానిమల్ అనే సినిమా చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు.

సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగుతోంది. యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ భారీ విజయాన్ని అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటించాడు . అక్కడకూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఇప్పుడు యానిమల్ అనే సినిమా చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇపుడు థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది. తెలుగులోనూ యానిమల్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా యానిమల్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.
యానిమల్ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రష్మిక మందన్నాను అనుకోలేదట. ఆమె కంటే ముందు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాను ఎంపిక చేశాడట సందీప్. ఆమె సినిమాకోసం సైన్ కూడా చేసిందంట. అయితే లుక్ టెస్ట్ చేసిన తర్వాత యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రకు ఆమె సెట్ కాలేదట. పరిణీత మంచి నటి అయినప్పటికీ యానిమల్ సినిమాలో పాత్రకు సూట్ కాలేదని ఫీల్ అయిన సందీప్ ఆమెను తప్పించారట. ఆ తర్వాత రష్మిక మందన్న ను ఎంపిక చేశారట సందీప్ రెడ్డి.
View this post on Instagram
పరిణితి చోప్రా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



