AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే

దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కిన ఈ రెండు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ఈ సినిమా ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే
Gunturu Kaaram
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2023 | 11:44 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. సర్కారు వారి పాట సినిమా తర్వత మహేష్ బాబు నటిస్తున్న సినిమా గుంటూరు కారం. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కిన ఈ రెండు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ఈ సినిమా ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, రీసెంట్ గా వచ్చిన దమ్ మసాలా సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా నుంచి లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు డాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మొదటి సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ పై క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే హీరో నితిన్ త్రివిక్రమ్ ను కలిసిన సమయంలో గుంటూరు కారం సెకండ్ సాంగ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ నితిన్ కు రిప్లే ఇస్తూ.. రెండు రోజుల్లో సెకండ్ సాంగ్ అప్డేట్ ఇస్తాం అన్నారు. అంటే రేపు గుంటూరు కారం నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీలీల పై సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కేరళలో చిత్రీకరిస్తున్నారట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.