Samyuktha Menon: పెళ్లి పై సంచలన కామెంట్స్ చేసిన సంయుక్త.. ఈ ఆన్సర్ అస్సలు ఊహించలేదు గురూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది. ఈ సినిమాలో రానాకు జోడీగా నటించింది సంయక్త. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో చేసింది.
ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ముద్దుగుమ్మల్లో సంయుక్తమీనన్ ఒకరు. ఈ అమ్మడు వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది. ఈ సినిమాలో రానాకు జోడీగా నటించింది సంయక్త. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సంయుక్తకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ చేస్తోన్న సర్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మామూలుగానే హీరోయిన్స్ పెళ్ళికి సంబంధించిన రూమర్స్ హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సంయుక్తకు కూడా పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీని పై సంయుక్త చేసిన కామెంట్స్ ఇప్పుడు తగ వైరల్ అవుతున్నాయి.
నేను పెళ్ళిచేసుకోవాలని అనుకుంటే.. అందుకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకొనేవాడు దొరకాలి. నా ఎమోషన్స్ ను గౌరవించాలి. ఇలా అన్ని రకాలుగా నచ్చితే అప్పుడు పెళ్లిగురించి ఆలోచిస్తా.. ఇప్పటికైతే పెళ్లి ఆలోచన లేదు అని తేల్చి చెప్పింది. అలాగే చాలా మంది పెళ్లి అవసరమా అని అంటున్నారు. కొందరు మహిళలు కూడా అదే విషయం చెప్పారు. పెళ్లి చేసుకునేవాడు సరైనవాడు దొరికితేనే మహిళ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే పెళ్లి మీద అసహనం ఏర్పడుతుంది అని చెప్పుకొచ్చింది సంయుక్త