Samantha : శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నటిస్తున్న సమంత.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రానున్న మూవీ.

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై శివ లెంక ప్రసాద్ తెలుగు, తమిళ్ , హిందీ భాషలో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. హరి–హరీష్‌ దర్శకత్వం

Samantha : శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నటిస్తున్న సమంత..  హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రానున్న మూవీ.
Samantha
Follow us

|

Updated on: Nov 14, 2022 | 1:02 PM

Samantha: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌  తెలుగు, తమిళ  భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు  సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లో తెలుగు, తమిళ  భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. అలాగే త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. విడాకుల తర్వాత సమంత నటిస్తున్న మొదటి సినిమా ఇది.