Samantha: వరుస ఆఫర్లతో జోష్ మీదున్న సమంత.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో సామ్..

ప్రస్తుతం సమంత స్విట్జార్లాండ్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి

Samantha: వరుస ఆఫర్లతో జోష్ మీదున్న సమంత.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో సామ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2022 | 8:26 AM

ప్రస్తుతం సమంత స్విట్జార్లాండ్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్‏లో నటించి అదుర్స్ అనిపించుకుంది. ఊ అంటావా మావ.. ఊహు అంటావా అంటూ సామ్ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన అనంతరం సామ్ వరుస ఆపర్లతో మళ్లీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు యశోద సినిమాలో నటిస్తోంది.

అలాగే సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం తమిళం నుంచి సమంతకు పిలుపువచ్చిందట. తమిళ్ స్టార్ హీరో కార్తీ మూవీలో నటించేందుకు సమంతను ఎంచుకున్నారని టాక్. ఇందుకు సామ్‏తో సంప్రదింపులు జరిపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో కార్తీ. తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ … ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తమిళంలోనే కాకుండా..తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తీ. అయితే ఇటీవల వచ్చిన సుల్తాన్ మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కార్తీ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‏గా సమంతను తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్. ఇందుకు ఆమెతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారట. అయితే ఇప్పుడు సమంత బాలీవుడ్, హాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హిందీలో రెండు ప్రాజెక్టులలో సామ్ నటిస్తోంది. మరీ ఇప్పుడు కార్తీ సినిమాకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?