టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రాంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‌లోనూ సామ్ నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సామ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కేవలం సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో మోటివేషన్ కోట్ షేర్ చేసారు.
“కష్టమైన విషయాలు మంచి విషయాలకు దారితీస్తాయి. కాలాలు మీ బలాన్ని పరీక్షిస్తాయి.. పరిస్థితులు మీకు అసౌకర్యంగా ఉంటాయి.. అలాంటి పరిస్థితులపట్ల మీరు చూపే ధైర్యం.. అందుకు అవసరమైన నిర్ణయాలు మిమ్మల్ని నిజమైన నెరవేర్పు వైపు నడిపించేవి. మీరు అగ్ని గుండా నడవడానికి, అనిశ్చితికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే.. మీరు చివరికి మీ కోసం ఎదురుచూసే అందం ప్రపంచాన్ని చూస్తారు. కాబట్టి కష్టాల నుంచి పారిపోవడం మానేయండి. ఎందుకంటే కష్టమైన విషయాలు మంచి విషయాలు పెరగడానికి పునాది వేస్తాయి” అనే మోటివేషనల్ కోట్ షేర్ చేశారు సామ్.
ఇధిలా ఉంటే సామ్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ విమానాశ్రయంలో స్టైలీష్ లుక్ లో కనిపించారు. ట్యాంక్ టాప్.. నడుముకు హూడీ జాకెట్ తో… వైట్ ప్యాంటును ధరించి స్టైలీష్ అండ్ కూల్ లుక్‌లో కనిపించారు సామ్. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.