Samantha: జీవితంలో మానసిక సమస్యలు చాలా ఎదుర్కొన్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..
టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపిస్తోంది. ఇటీవల ఊ అంటావా.. ఊహు అంటావా పాటతో ఫుల్ జోష్
టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపిస్తోంది. ఇటీవల ఊ అంటావా.. ఊహు అంటావా పాటతో ఫుల్ జోష్ మీదున్నారు సామ్. అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సామ్. అయితే గత కొద్దిరోజులుగా సమంత విడాకుల తర్వాత తాను ఎదుర్కోన్న పరిస్థితులు.. మానసిక సంఘర్షణ గురించి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి సంచలన విషయాలను బయటపెట్టింది సామ్.
జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని పేర్కోంది సామ్. రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కోన్నా. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నా. నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి ” అని చెప్పుకొచ్చారు సామ్.
ప్రస్తుతం సమంత వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల పుష్పలో ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటతో అదరగొట్టిన సామ్.. ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది. ఇక సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!