Samantha Ruth Prabhu: సమంతకు గిఫ్ట్ పంపిన హీరో.. విజయం నీ జన్మ హక్కు అంటూ..
సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సామ్ ఎదోఒక వార్త తో హాట్ టాపిక్ గీతా మారుతోంది. రీసెంట్ గా యశోద సినిమాతో హిట్ అందుకుంది సామ్. ఇక సామ్ కు మయో సైటిస్ అని తెలిసి ఆమె అభిమానులంతా కలవరపడుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత కొంతకాలం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు.
ఇదిలా ఉంటే తాజాగా సామ్ కు క్రిస్మస్ సమంతకు గిఫ్ట్ పంపాడు ఒక హీరో . ఆ హీరో ఎవరో కాదు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాహుల్. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఇక రాహుల్ సతీమణి సింగర్ చిన్మయి గురించి అందరికి తెలిసిందే.
సమంత, చిన్మయి మంచి స్నేహితులు. సామ్ సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు. తాజాగా రాహుల్ సామ్ కు ఒక ఫోటో ను గిఫ్ట్ గా పంపించాడు. ఆ ఫొటోలో నువ్వు వెళ్లే దారి చీకటిగా ఉండొచ్చు కానీ అది త్వరలోనే ప్రకాశిస్తుంది. నువ్వు కదల్లేకపోవచ్చు కానీ త్వరలోనే అన్ని బాగుంటాయి. ఎందుకంటే నువ్వు ఒక వారియర్.. నిన్ను ఏది ఓడించలేదు. విజయం నీజన్మ హక్కు అని కొటేషన్ ఉన్న ఫోటోను పంపాడు. ఈ గిఫ్ట్ పై సామ్ స్పందిస్తూ.. పోరాటం చేస్తున్న వారందరికి ఇది అంకితం అని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.