Anupama parameswaran: ఒక్కసారైనా ఆ పని చేయాలనేదే నా కోరిక.. క్యూట్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
తాజాగా కార్తికేయ 2తో భారీ విజయాన్ని అందుకున్న అనుపమ తెలుగులో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది..
ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది బ్యూటీ. అనంతరం ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది. ఇక అనంతరం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ పోతోంది. తాజాగా కార్తికేయ 2తో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది తెలుగులో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది 18 పేజెస్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టిందీ బ్యూటీ. ఇప్పటి వరకు ప్రేమ కథ చిత్రాల్లోనే ఎక్కువగా నటించానని చెప్పిన అనుపమ, రానున్న రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇక తనకు నటనతో పాటు దర్శకత్వం అంటే చాలా ఇష్టమని మనసులో మాటను బయటపెట్టింది. జీవితంలో ఒక్కసారైనా మెగా ఫోన్ పట్టుకోవాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది.
ఇక్కడితో ఆగని అనుపమ తాను ఎప్పుడైతే దర్శకత్వం వహించాలని కోరుకుంటుందో ఆ సమయంలో ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మంచి డైరెక్టర్ల దగ్గర శిష్యరికం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తన మదిలో కొన్ని కథనాలు ఉన్నాయని తెలిపిన అనుపమ ప్రస్తుతం మాత్రం తనకు ఇంకా మరికొన్ని సినిమాల్లో నటించాలని ఉందని అందుకే దర్శకత్వంపై ఇప్పటికిప్పుడు ఆలోచనలేదని క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..