Kaikala Satyanarayana: కృష్ణం రాజుగారికోసమే కైకాల ఆలాంటి పాత్రలు చేశేవారు.. ఆసక్తికర విషయం పంచుకున్న కృష్ణంరాజు సతీమణి

నేడు మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణించారు. దాంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఈ లెజెండ్రీ నటులకు నివాళులు అర్పిస్తున్నారు.

Kaikala Satyanarayana: కృష్ణం రాజుగారికోసమే కైకాల ఆలాంటి పాత్రలు చేశేవారు.. ఆసక్తికర విషయం పంచుకున్న కృష్ణంరాజు సతీమణి
Shyamala Devi
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2022 | 4:48 PM

ఈ ఏడాది చివరిలో టాలీవుడ్ ను విషాదాలు ముం చేశాయి. టాలీవుడ్ దిగ్గజ నటులు డిసెంబర్ నెలలో కనుమూశారు. మొన్న కైకాల సత్యనారాయణ కన్నుమూయగా.. నేడు మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణించారు. దాంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఈ లెజెండ్రీ నటులకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఇంతకు ముందుకు రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. అయితే కృష్ణం రాజుకు, కైకాల సత్రనారాయణకు ప్రత్యేక అనుబంధం ఉండేది. కైకాల మరణ వార్త తెలిసి కృష్ణం రాజు సతీమణి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ.. కైకాలకు కృష్ణం రాజుకు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్యామలాదేవి మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ మరణ వార్త విని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒకే ఏడాదిలో ఇలా సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉన్నవారిని కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు.

కైకాల సత్యనారాయణ గారి మరణ వార్త తనని ఎంతగానో కలిసివేసిందని అన్నారు శ్యామలాదేవి. మా కుటుంబంకు కైకాల గారి భార్య పిల్లలు చాలా క్లోజ్ గా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా ఉండేవారు. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన కైకాల గారు కేవలం కృష్ణంరాజు గారి కోసమే కామెడీ పాత్రలలో నటించారని అన్నారు. ఇదే విషయాన్ని కృష్ణంరాజు గారు ఎప్పుడు చెప్పేవారని శ్యామలాదేవి అన్నారు.

ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలని కైకాల గారిని కృష్ణం రాజుగారు ఆహ్వానించారు. వీలు చూసుకుని కబురు పంపితే వస్తానని కైకాల గారు చెప్పారు. అయితే ఆయన మా ఇంటికి భోజనానికి రాకముందే కృష్ణంరాజు గారు కన్నుమూశారు. ఇక ఇప్పుడు కైకాల గారు మరణించారని శ్యామలాదేవి ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి