Cirkus: ఏందిరయ్యా.. ఏందిది.. రణవీర్ సింగ్ సినిమా పై ట్రోల్స్.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు
ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది . శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కస్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది . శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రేక్షకుల్లో ఈ మూవీ పై అంతగా ఆసక్తి చూపలేదు. ఈ మూవీ బుకింగ్స్ కూడా దారుణంగా జరిగాయి. ఇక తొలి రోజు ఈ సినిమా కేవలం మూడు కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతలా ప్రేక్షకులను నిరాశ పరిచింది ఈ మూవీ. ఈ సినిమాలో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. అయితే ఈ రెండు పాత్రల్లో రణవీర్ నటన ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పాత్ర చేసిన ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు చిరాకు పుట్టించిందని తెలుస్తోంది.
ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చక పోవడం షాకింగ్ విషయం. కథ కథనం కొత్తగా లేకపోవడం.. రణవీర్ ఓవర్ యాక్షన్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. హీరోతో పాటు సైడ్ రోల్ తో కూడా ద్విపాత్రాభినయం చేయించి కన్ఫ్యుజ్ క్రియేట్ చేశారు దర్శకుడు రోహిత్ శెట్టి. పాత రొటీన్ స్టోరీనే తీసి డిజాస్టర్ అందుకున్నారు రోహిత్ శెట్టి.
మరోవైపు హీరోయిన్ పూజ హెగ్డేకు ఈ సినిమా అంత ప్రధానత ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మడికి అక్కడ కూడా ఫ్లాప్ తప్పలేదు. ఈ సినిమా రిజల్ట్ పై దర్శకుడు రోహిత్ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా ఈ ఏడాది చివరిలో భారీ డిజాస్టర్ గా నిలిచింది సర్కస్ .
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.