Samantha: నీలా ఎవరూ డాన్స్ చేయలేరు.. రామ్ చరణ్ సాంగ్ పై సామ్ కామెంట్స్

|

Oct 01, 2024 | 4:04 PM

ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఇప్పటివరకు ఫ్యాన్స్ కు సరైన అప్డేట్ అందించలేకపోయారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. శంకర్ భారతీయుడు 2 సినిమా పనుల్లో బిజీ అవ్వడంతో..

Samantha: నీలా ఎవరూ డాన్స్ చేయలేరు.. రామ్ చరణ్ సాంగ్ పై సామ్ కామెంట్స్
Samantha , Ram Charan
Follow us on

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఇప్పటివరకు ఫ్యాన్స్ కు సరైన అప్డేట్ అందించలేకపోయారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. శంకర్ భారతీయుడు 2 సినిమా పనుల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

అలాగే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. రారా మచ్చ అనే సాంగ్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈసాంగ్ లో చరణ్ డాన్స్ ఇరగదీశారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

24 గంటలు కూడా గడవక ముందే ఈ సాంగ్ 16 మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఈ పాటపై మెగా అభిమానులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. సాంగ్ విడుదల సందర్భంగా చరణ్ ఈ భారీ పాటను నేను ఆనందించినట్లు.. మీరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ఆయన సతీమణి స్పందిస్తూ..మిస్టర్‌ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్‌ పుట్టించారు అని రాసుకొచ్చారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత గేమ్ ఛేంజర్ సాంగ్ పై స్పందించింది. అన్‌మ్యాచ్‌బుల్‌.. ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు.. అంటూ రాసుకొచ్చింది సమంత

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి