Samantha: ‘ప్రస్తుతానికైతే నేను చావట్లేదు..’ సమంత కన్నీటి పర్యంతం.. ధైర్యం చెబుతోన్న ఫ్యాన్స్..
'నాకు ఒక్కో రోజు.. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇంత దూరం వచ్చానా? అని అనిపిస్తుంది.
‘‘నా పోస్ట్‌లో నేను చెప్పినట్లుగా.. మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా.. మరొక రోజు మరోలా ఉంటుందని యశోద మూవీ ప్రమోషన్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంది హీరోయిన్ సమంత. తన అనారోగ్యంపై మాట్లాడుతూ.. ‘నాకు ఒక్కో రోజు.. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇంత దూరం వచ్చానా? అని అనిపిస్తుంది. కానీ యుద్ధం చేయాలి. నేనొక్కదానినే కాదు.. బయట ఎంతో మంది జీవితం కోసం యుద్ధం చేస్తున్నారు. చివరికి ఖచ్చితంగా విజయం సాధిస్తారు’ అని పేర్కొంది.
నేను చాలా ఆర్టికల్స్ చూశాను. నాకున్న వ్యాధి చాలా ప్రాణాంతకరమైన వ్యాధి అని రాశారు. కానీ ప్రస్తుతం నేనున్న స్టేజ్‌లో అది ప్రాణాంతకమైనది మాత్రం కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అటువంటి హెడ్‌లైన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇబ్బంది మాత్రం ఉంది. నేను ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నా.. పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు’’ అని సమంత తెలిపింది. ఈ పరిస్థితులు తనకు చాలా నేర్పించాయని…మన కంట్రోల్‌లో ఏమీ ఉండదు. లైఫ్ హాస్ ఇట్స్ వే ఆఫ్ ఫిగరింగ్ థింగ్స్ ఔట్ అంటూ సామ్ చెప్పింది.
ఇదిలా ఉంటే.. మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న సమంత అనారోగ్యంపై సోషల్ మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దిటవు గుండెల వెనుక దాగిన బాధను ఒక్కసారిగా వెళ్ళబుచ్చారు సమంత. తెరలు తెరలుగా ఉబికుబికి వస్తోన్న కన్నీళ్ళను అదిమిపెట్టి ధైర్యంగా సమాధానమిచ్చారు సమంత. తానింకా బతికే ఉన్నానంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు సమంత. తన వైవాహిక జీవితంపైనా స్పందిస్తూ ఇప్పటికైతే నేను హ్యాపీగా ఉన్నానన్నారు సమంత. సమంత గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తాజాగా సమంత స్పెషల్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది.
Take care sam?
— Sudeep (@SudeepS03873780) November 7, 2022
Get well soon sam ?
— Uday Reddy (@Uday81740905) November 7, 2022