Samantha Ruth Prabhu: ఆ సినిమా పైనే బోలెడన్నీ ఆశలు పెట్టుకున్న సామ్.. అప్పటివరకు నో మూవీస్
. విడుదలకు ముందు ఈ రెండు చిత్రాలపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకోంది. కానీ బాక్సాఫీసు వద్ద రిజల్డ్ తేడా కొట్టడంతో.. పని చేయ్.. ఫలితం ఆశించకు అంటూ కర్మ సిద్ధాంతాని తలుచుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది సామ్.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఓ వైపు అనారోగ్య సమస్యలు.. మరోవైపు వరుస ఫ్లాపులు సమంతను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మొన్న యశోద.. నిన్న శాకుంతలం ఫలితాలు సామ్ ను సంతృప్తి పర్చలేదు. విడుదలకు ముందు ఈ రెండు చిత్రాలపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకోంది. కానీ బాక్సాఫీసు వద్ద రిజల్డ్ తేడా కొట్టడంతో.. పని చేయ్.. ఫలితం ఆశించకు అంటూ కర్మ సిద్ధాంతాని తలుచుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది సామ్. ఇక రాబోయే ఖుషితోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.
మాయ.. ప్రేమను మరిపిస్తుందేమో కానీ.. అభిమానాన్ని, అవమానాన్నిమరిపించదు. ఇటీవల విడుదలైన శాకుంతలం చిత్రంలోని డైలాగ్ ఇది. అచ్చం అదే బాధను పట్టి బిగువన భరిస్తూ వస్తోంది సమంత. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ తో పోటీపడుతూ ధృడంగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తన జర్నీ కొనసాగిస్తోంది. మయోసైటిస్ నుంచి కొలుకొని తిరిగి తన జర్నీని మొదలుపెట్టిన సమంతకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఉమెన్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను మెప్పిద్దామనున్న సామ్ కు నిరాశ తప్పడం లేదు.
అందుకే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. సినిమాలు చేయడం వరకే తన బాధ్యతని, ఫలితాన్ని ఆశించడం లేదంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది. సమంత పోస్టు చూసిన అభిమానులు.. సామ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ఇంత వరకు తెచ్చుకుంటుందని, ఫలితం అనుభవించాల్సిందేనని చెవులు కొరుక్కుంటున్నారు. తన కష్టాలకు కన్నీళ్లు పెట్టగలం తప్ప కర్మను పంచుకోమంటున్నారు అభిమానులు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్నాళ్లపాటు సామ్ నటనకు, అందానికి ప్రేక్షకులు ఊ అనడమే తప్ప ఊఊ అనడం తెలియదు. తను కనిపిస్తే చాలు.. కుర్రకారు గుండెలు గట్టిగా కొట్టుకునేవి. ఏరు శెనగ కోసం మట్టిని తవ్వే నిర్మాతలకు లంకె బిందెలాగే దొరేకేది. చింత చెట్టెక్కి చిగురు కోయాలనుకునే దర్శకుల చేతికి చందమామలాగ చిక్కేది. అలాంటి.. సామ్ మజిలి.. సినీలాకాశంలో ఏకాకి మేఘమైంది. కదిలిస్తే కన్నీళ్లు కురుస్తున్నాయి. పలకరిస్తే మాటలు పెదవిదాటడం లేదు.
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ లో సమంత భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. విజయ్ దేవరకొండతో చేస్తోన్న ఖుషి చిత్రంపైనే బోలెడంత నమ్మకాన్ని పెట్టుకుంది సామ్. ఆ సినిమా విడుదలయ్యేంత వరకు ఎలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట. అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లోనూ సామ్ నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు బయటికొచ్చి మంచి టాక్ సంపాదించుకుంటే తప్ప.. సామ్ మళ్లీ మునపటి స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. అప్పటి వరకు తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఆధ్యాత్మిక బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.